తమతో కలిసి రావాలన్న మోదీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన

  • తమతో కలిసి రావాలని రేవంత్ కు చెప్పిన మోదీ
  • కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి
  • ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని వ్యాఖ్య

రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'గుజరాత్ కు ఇచ్చినంత తెలంగాణకు కూడా ఇస్తాం. మాతో కలిసిరండి' అని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ, పార్టీల ఐడియాలజీలు వేరైనా ప్రజల సంక్షేమం కోసం 'గివ్ అండ్ టేక్' (ఇచ్చిపుచ్చుకునే) ధోరణి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 


ముఖ్యంగా విజన్ 2047, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్రంతో కలిసి నడుస్తామని రేవంత్ చెప్పారు. ఎన్నోసార్లు కలిసినా కేంద్ర నుంచి ఆశించిన మద్దతు రాలేదని రేవంత్ అన్నారు. ప్రధాని 2 గంటల పాటు సమయం ఇస్తే తమ ప్రణాళికలను వివరిస్తామని చెప్పారు.


Revanth Reddy
Telangana
Narendra Modi
Central Government
State Development
Vision 2047
3 Trillion Dollar Economy
Give and Take Policy

More Telugu News